Site icon NTV Telugu

Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా

Tollywood

Tollywood

Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అందుకు కారణం హీరోల భార్యలే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక హీరోల భార్యలు కేవలం భర్తను, కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా వారు కూడా బిజినెస్ లు చేస్తూ బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఇప్పటివరకు హీరోలు.. ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆనందపడతాం.. తాజాగా స్టార్ హీరోల భార్యలు ఒకే ఫ్రేమ్ లో కనిపించి షాక్ ఇచ్చారు.

Actor Ganga: పండగ పూట విషాదం.. ప్రముఖ సీనియర్ హీరో మృతి

గతరాత్రి రామ్ చరణ్ దివాళీ పార్టీలో ఈ అరుదైన కలయిక జరిగింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ లో హీరోల ఫోటో కంటే.. హీరోల భార్యల ఫొటోలే నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోలో అల్లు అర్జున్ భార్య స్నేహ, రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి.. కనిపించారు. పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్ ల్లో హీరోల భార్యలు.. హీరోయిన్లను మించి అందంగా కనిపించారు. ఈ ఫోటోలు దీపావళి ని మరింత కాంతివంతంగా మార్చాయి అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

Exit mobile version