NTV Telugu Site icon

Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

Tollywood Producers

Tollywood Producers

Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడ‌లోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు.

Also Read: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!

చలసాని అశ్విని దత్ (వైజయంతి మూవీస్), అల్లు అరవింద్ (గీత ఆర్ట్స్), ఎర్నేని నవీన్ (మైత్రి మూవీ మేకర్స్), దగ్గుబాటి సురేష్ బాబు (సురేష్ ప్రొడక్షన్స్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), యార్లగడ్డ సుప్రియ (అన్నపూర్ణ)లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు స్పెషల్ ఫ్లయిట్‌లో వెళ్లారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు డిప్యూటీ సీఎంతో నిర్మాతలు చర్చించనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాతలు కలిసి వెళుతుండడంతో ఈ భేటీపై అందరి దృష్టి ఉంది.