టాలీవుడ్ లో ఈ దీపావళికి నాలుగు సినిమాలు వచ్చాయి. మరి వాటిలో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సౌండ్ చేసే బాంబులాగా పేలాయి.. ఏవి తుస్సుమనిపించాయో తెలుసుకుందాం..
తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా నటించిన ఈ సినిమా అక్టోబరు 17న రిలీజ్ కాగా ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టి దీపావళి తుస్సు బాంబుగా మారింది.
Also Read : Prabhas : రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్.. రీ – రిలీజ్ సినిమాల వర్షం..
K RAMP : కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11 వ సినిమాగా వచ్చిన ఈ సినిమా చిత్రం ‘K’. ఈ నెల 18న థియేటర్స లో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచుకుంది. ఓపెనింగ్ డే రూ. 4.5 కోట్లతో సాలిడ్ స్టార్ట్ అందుకుని హౌస్ ఫుల్స్ తో నడుస్తుంది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఈ సినిమాకు ఎక్కవ కలెక్షన్స్ రాబట్టి థియేటర్స్ లో సీమ టపాకాయ్ లాగా సౌండ్ చేస్తోంది.
మిత్రమండలి : ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. అక్టోబరు 16న రిలీజ్ కు ఒకరోజు ముందుగా వేసిన ప్రీమియర్స్ తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజె వైట్ వాష్ అయి ఈ దీపావళికో సౌండ్ చేయకుండా తుస్సుమనిపించింది..
DUDE : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ప్రదీప్ గత సినిమాలకు ఉన్న క్రేజ్, ప్రదీప్ యాక్టింగ్ ఉన్న ఫ్యాన్ బేస్ తో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తో దీపావలీకి వంకాయ్ బాంబులాగా సౌండ్ చేస్తోంది.