Site icon NTV Telugu

Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో తెలుసా

Tollywood

Tollywood

తెలుగు సినీ పరిశ్రమలో హీరోల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లి ఎప్పుడు జరిగింది? ఏ వయసులో వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. తాజాగా రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల నేపథ్యంలో, టాలీవుడ్ స్టార్ హీరోల వివాహ వయసుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Also Read : Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?

మన టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మంది కెరీర్ ప్రారంభంలోనే, అంటే 30 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 27వ ఏటనే ఉపాసనను వివాహం చేసుకోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతి మెడలో మూడు ముళ్లు వేశారు. నేచురల్ స్టార్ నాని కూడా తన 28వ ఏటనే అంజనతో ఏడడుగులు వేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరూ కూడా సరిగ్గా 29 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. యువ హీరోలు చాలా మంది ముప్పైలలో స్థిరపడ్డాక పెళ్లికి మొగ్గు చూపారు. నాగ చైతన్య 30 ఏళ్ల వయసులో వివాహం చేసుకోగా, మెగా హీరో వరుణ్ తేజ్ 33 ఏళ్ల వయసులో లావణ్య త్రిపాఠితో ఒకటయ్యారు. హీరో నిఖిల్ తన 34వ ఏట, భల్లాలదేవ రానా దగ్గుబాటి 35 ఏళ్ల వయసులో మిహీకతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కొంతమంది హీరోలు మరికొంత సమయం తీసుకుని లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. లవర్ బాయ్ నితిన్ 37 ఏళ్ల వయసులో వివాహం చేసుకోగా, శర్వానంద్ తన 38వ ఏట రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు.మొత్తానికి మన టాలీవుడ్ హీరోలు కొందరు కెరీర్ తొలినాళ్లలోనే ఒకటవ్వగా, మరికొందరు 30 ఏళ్లు దాటాక తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకున్నారు. కానీ ప్రభాస్ 47 ఏళ్ల వయసు వచినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా సోలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు.

Exit mobile version