ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్‌లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే, రాజీ పడి ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నారు.
Also Read : Rashmika : ఐటెం సాంగ్ విషయంలో డైరెక్టర్లకు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..
ఇలా చేయకపోతే సమయం వృధా అవ్వడమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ నష్టం తప్పదు. కావాల్సిన హీరో కోసం ఏళ్ళ తరబడి వేచి చూస్తే, చివరి నిమిషంలో ఆ హీరో మాట మారుస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే చాలా మంది ‘రాజీ’ పడుతున్నారట. ఉదాహరణకు.. ‘తండేల్’ వంటి హిట్ తర్వాత చందు మొండేటి ఖాళీగా ఉండలేక ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ మూవీ చేస్తున్నారు. త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నా, హీరో కుదరక రీజనల్ స్టార్‌తో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు పాన్ ఇండియా హిట్లు ఇచ్చినా సరైన హీరో దొరక్క వేచి చూస్తున్నారు. శివ, గౌతమ్ తిన్ననూరి, కొరటాల శివ వంటి వారు కూడా స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. మొత్తానికి, టాలీవుడ్‌లో ఇప్పుడు కాంబినేషన్ల వేటలో ‘అడ్జస్ట్‌మెంట్’ అనేది ఒక అనివార్యమైన అంశంగా మారిపోయిందని.
