Toefl Preparatory Certification: ఏప్రిల్ 10న టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,104 పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీ ఎస్, ప్రిన్స్ టన్, యు.ఎస్.ఏ) నిర్వహించే టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
Also read: SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రెడ్డి.. పంజాబ్ టార్గెట్ 183..!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక మరోవైపు ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్రంలోని 5,907 పాఠశాలలకు చెందిన 6 నుండి 9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులు కూడా ఈటీఎస్ నిర్వహించనున్న టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షకు హాజరుకానున్నారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇక పరీక్షకు సంబంధించిన పరీక్ష మూల్యాంకనం తర్వాత ఆయా విద్యార్థులకు ప్రిన్స్ టన్, యు.ఎస్.ఏ యొక్క ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నుండి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. టోఫెల్ పరీక్ష కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్లు, స్మార్ట్ టీవీలు వినియోగించనున్న నేపథ్యంలో వాటి పనితీరుపై దృష్టి సారించాలని డీఈఓలకు ఆయన సూచించారు. ప్రతి జిల్లాలలో అత్యుత్తమ పాఠశాలలుగా ఉండేందుకు, వాటిని తీర్చిదిద్దెందుకు పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణానికి ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాల ఓ మంచి స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు.
Also read: Heeramandi: ఏంటి భయ్యా.. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో వేశ్యలుగా నటించారా..?!
ఒక్కోసారి ఓ సంవత్సరం చివరి స్థానంలో ఉన్న పాఠశాల మరో సంవత్సరం మొదటి స్థానంలో ఉండవచ్చన్నారు. ఇక రాష్ట్రంలోని విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు, బంగారు భవిష్యత్ కల్పించడంలో ఎలాంటి రాజీ పడే అవకాశమే లేదన్నారు. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్నప్పటి నుంచే టోఫెల్ పరీక్షకు సిద్ధం చేయడం తమ లక్ష్యం అని తెలుపుతూ.. టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!