NTV Telugu Site icon

Viral Video: శుభ్‌మాన్ గిల్ సోదరితో రింకూ సింగ్.. వీడియో వైరల్!

Rinku Singh, Shahneel Gill

Rinku Singh, Shahneel Gill

Shahneel Gill and Rinku Singh’s Video: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్.. ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. మొదటి మ్యాచ్‌ ఓటమి తర్వాత పుంజుకున్న భారత జట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ వంటి స్టార్స్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో జింబాబ్వే సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాలను యువ బ్యాటర్లు అందిపుచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఎంజాయ్ కూడా చేస్తున్నారు.

భారత యువ క్రికెటర్ రింకూ సింగ్.. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సోదరి షహనీల్ గిల్‌తో చక్కర్లు కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండవ టీ20 తర్వాత విశ్రాంతి రోజున షహనీల్‌తో కలిసి రింకూ హరారేలో చక్కర్లు కొట్టాడు. హరారేలో జిరాఫీలతో ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. రింకూ, షహనీల్ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింకూ, గిల్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. షహనీల్ కూడా రింకూ మంచి ఫ్రెండ్. అందుకే ఇద్దరు కలిసి హరారేలో సరదాగా ఎంజాయ్ చేశారు.

Also Read: Shubman Gill Trolls: శుభ్‌మన్ గిల్‌ సెల్ఫిష్ కెప్టెన్.. టీ20లకు పనికిరాడు!

ఐపీఎల్ 2024 అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ మాల్దీవులకు వెళ్ళాడు. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ రింకూ ఓ పోస్ట్ చేయగా.. ‘ఓ హీరో.. ’ అంటూ షహనీల్ గిల్‌ కామెంట్ చేసింది. అప్పుడు కూడా ఈ కామెంట్ వైర‌ల్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోకి రాకముందు గిల్.. కోల్‌కతా నైట్‌ రైడర్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే గిల్, రింకూ, షహనీల్ మంచి స్నేహితులు.

Show comments