NTV Telugu Site icon

IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్

Sa Vs Ind 1st T20i

Sa Vs Ind 1st T20i

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందుగానే టాస్ వేయనున్నారు.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కూడా ఆతిథ్య జట్టును ఓడించి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తోంది.

Read Also: UP: ప్రియుడి వల్ల ఇద్దరు పిల్లలకు తల్లైన వివాహిత.. మూడోసారి గర్భం.. భర్త ఎలా గుర్తించాడంటే..

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20ని టీవీలో లైవ్ చూడడం ఎలా..?
భారత అభిమానులు స్పోర్ట్స్ 18, వివిధ ఛానెల్‌లలో భారతదేశం-దక్షిణాఫ్రికా 2nd టీ20ని ప్రత్యక్షంగా చూడవచ్చు.

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడటం ఎలా..?
భారత అభిమానులు JioCinemaలో పూర్తిగా ఉచితంగా ఆస్వాదించవచ్చు.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహలాలీ మ్పోంగ్వానా, ర్యానీల్ సిమ్టన్, ర్యానీల్ సిమ్‌టన్, ర్యానీల్ సిమ్‌టన్, సిపమ్లా, ట్రిస్టన్ స్టబ్స్.

Show comments