Bull Stops Cricket Match, Video Goes Viral: సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తుంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం, రద్దవడం మనం చూసే ఉంటాం. అప్పుడప్పుడు పక్షులు, కుక్క కారణంగా కూడా మ్యాచ్ కాసేపు ఆగిపోతుంది. అయితే తాజాగా ఓ ఎద్దు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఫాన్స్, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఓ మారుమూల గ్రామంలో చిన్నపాటి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. టెన్నిస్ బాల్‌తో రెండు జట్లు క్రికెట్ ఆడుతున్నాయి. ఆ మ్యాచ్ చూడ్డానికి చాలా మంది జనాలు కూడా వచ్చారు. మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా.. రెండు ఎద్దులు గ్రౌండ్లోకి దూసుకొచ్చాయి. అందులో ఒకటి మైదానంలోకి దూసుకొచ్చి.. హల్చల్ చేసింది. ఆటగాళ్లు దాన్ని బయటికి పంపే ప్రయత్నం చేసినా.. బెదరకుండా వారిపైకి దూసుకొచ్చింది. బ్యాట్‌తో బెదిరించే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు.
Also Read: Miss World 2024: మిస్ వరల్డ్ పోటీలు.. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యూటీ ఎవరంటే?
ఎద్దు దూకుడు చూసి అంపైర్‌తో సహా బౌలింగ్ చేసే కుర్రాడు, మిగతా ప్లేయర్స్ ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. ముఖ్యంగా బౌలింగ్ చేసే కుర్రాడు అయితే పరుగు అందుకున్నాడు. ఓ ఎక్స్ యూజర్ (Sameer Allana) పోస్ట్ చేసిన ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూడ్డానికి నవ్వు తెప్పిస్తున్నా.. అక్కడ ఉన్న వారికి మాత్రం వెన్నులో వణుకుపుట్టింది. ఆ ఎద్దు ఎవరికీ ఏ హాని చేయలేదని తెలిసింది.
When the bulls want to play cricket 🐂🏏 pic.twitter.com/SkrM9lbpzU
— Sameer Allana (@HitmanCricket) February 19, 2024