NTV Telugu Site icon

Cobra Viral Video: నాగదేవత విగ్రహంపై నాగుపాము.. అంతా ‘శివయ్య’ మహిమ!

Big Cobra On Nagadevata Idol

Big Cobra On Nagadevata Idol

Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు.

ఓదెల మండల కేంద్రంలోని శ్రీశంభులింగేశ్వర, అభయాంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో సోమవారం ఓ భారీ నాగుపాము సంచరించింది. చివరకు ఆలయాల సమీపంలోని మర్రిచెట్టు కింద ఉన్న నాగదేవత విగ్రహంపై పడగ విప్పింది. విగ్రహంపై పాము చాలా సమయం అలానే ఉంది. స్థానికులు నాగదేవత విగ్రహంపై ఉన్న పామును వీడియో తీసి వాట్సాప్​లో షేర్ చేశారు. దీంతో విషయం నిమిషాల వ్యవధిలో ఊరంతా పాకింది. స్థానికులు, భక్తులు తరలివచ్చి.. నాగుపామును ఆసక్తిగా తిలకించారు.

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

జనాలు పెద్ద సంఖ్యలో వచ్చినా కూడా నాగుపాము బెదరలేదు. నాగదేవత విగ్రహంపై అలానే ఉండిపోయింది. పాము ఎంతకు వెళ్లకపోవడంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతడు వచ్చి చాలా సమయం శ్రమించి పామును పట్టుకొని.. దూరంగా వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గ్రామస్థులు స్పందించారు. ఇలాంటి దృష్యాని తాము ఇంతవరకూ చూడలేదని, ఇది తమ అదృష్టం అని పేర్కొన్నారు. అంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఏదేమైనా నాగుపాముకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.