Cobra Viral Video: నాగదేవత విగ్రహంపై నాగుపాము.. అంతా ‘శివయ్య’ మహిమ!
- ఓదెలలో ఆసక్తికర సంఘటన
- నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపాము
- అంతా శివయ్య మహిమ అంటున్న భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు.
ఓదెల మండల కేంద్రంలోని శ్రీశంభులింగేశ్వర, అభయాంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో సోమవారం ఓ భారీ నాగుపాము సంచరించింది. చివరకు ఆలయాల సమీపంలోని మర్రిచెట్టు కింద ఉన్న నాగదేవత విగ్రహంపై పడగ విప్పింది. విగ్రహంపై పాము చాలా సమయం అలానే ఉంది. స్థానికులు నాగదేవత విగ్రహంపై ఉన్న పామును వీడియో తీసి వాట్సాప్‌లో షేర్ చేశారు. దీంతో విషయం నిమిషాల వ్యవధిలో ఊరంతా పాకింది. స్థానికులు, భక్తులు తరలివచ్చి.. నాగుపామును ఆసక్తిగా తిలకించారు.
Also Read
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!
జనాలు పెద్ద సంఖ్యలో వచ్చినా కూడా నాగుపాము బెదరలేదు. నాగదేవత విగ్రహంపై అలానే ఉండిపోయింది. పాము ఎంతకు వెళ్లకపోవడంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతడు వచ్చి చాలా సమయం శ్రమించి పామును పట్టుకొని.. దూరంగా వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గ్రామస్థులు స్పందించారు. ఇలాంటి దృష్యాని తాము ఇంతవరకూ చూడలేదని, ఇది తమ అదృష్టం అని పేర్కొన్నారు. అంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఏదేమైనా నాగుపాముకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?