NTV Telugu Site icon

Gold Price: బంగారం కొనాలంటే ఇదే కరెక్ట్ టైం.. లేట్ అయితే కొనలేరు

Gold

Gold

Gold Price: బంగారం కొనేవాళ్లకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.. దీపావళి, ధన్ తేరాస్, కర్వా చౌథ్ రానున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ కానుంది. దసరా సీజన్ లో గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయి. మళ్లీ దివాళి నాటికి మరింత రేటు పెరగవచ్చని వ్యాపారస్తులు భావిస్తున్నారు. సాధారణంగా బంగారం అంటే ఇష్టపడే భారతీయులు పండగలు, శుభకార్యాలప్పుడు ఎక్కువగా కొంటుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. అందుకే పండుగల సీజన్ వచ్చిందంటే పసిడి దుకాణాలు కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం నాలుగు రోజులుగా బంగారం రేట్లలో మార్పు లేదు. అంతకుముందు నాలుగు రోజుల్లో మాత్రం వరుసగా పెరుగుకుంటూ ఏకంగా రూ.1500 మేర ఎగసింది. తర్వాత 4 రోజులు స్థిరంగా ఉన్నాయి.

Read Also: TSPSC: టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్ల విడుదల

నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నయో ఓ సారి పరిశీలించినట్లైతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 47,850 వద్ద ఉంది. అక్టోబర్ 5న ఈ రేటు రూ.47,750 వద్ద ఉండగా.. మరుసటి రోజు రూ.100 పెరిగింది. అప్పటినుంచి ధరల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,200 వద్ద స్థిరంగా ఉంది. సిల్వర్ రేట్లు కూడా ఏం మారలేదు. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు ప్రస్తుతం రూ.66 వేల వద్ద ఉంది. అక్టోబర్ 6,8 తేదీల్లో మాత్రం రూ. 500 చొప్పున తగ్గగా.. అంతకుముందు ఒకే రోజు ఇది రూ.4200 మేర పెరగడం గమనార్హం.

Read Also:Harish Rao : ప్రతీ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్

పెరుగుతున్న క్రూడాయిల్ ధరల కారణంగానే బంగారం రేట్లు పెరుగుతున్నాయని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 100 డాలర్లకు చేరువలో ఉంది. స్పాట్ గోల్డ్ ధర 1700 డాలర్లకు దిగువనే ఉంది. స్పాట్ సిల్వర్ 19.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వరుసగా రెండో వారం బంగారం ధరలు పెరిగాయి. దీపావళికల్లా అక్కడ గోల్డ్ రేట్లు రూ.53 వేల స్థాయికి చేరుతాయని తెలుస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఆచితూచి వ్యవహరించాలి.