రోగి డిచ్ఛార్జ్ సమయంలో ఎన్ని రోజులకు మందులు అవసరమో అన్ని మందులు ఉచితంగా రోగికి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. ఆదివారం టీవీవీ ఆసుపత్రుల నెల వారీ పని తీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతీ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్, ఆపరేషన్ ధియోటర్లను స్టెరిలైజేషన్ లో నిర్లక్ష్యం వద్దని ఆయన తెలిపారు. ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ క్వాలిటీ చెకింగ్ తప్పని సరి అని ఆయన వ్యాఖ్యానించారు.
రోగులు, వారి సహాయకుల పట్ల, దురుసుగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోగుల నుండి డబ్బులు డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శానిటేషన్, డైట్ మెరుగుపడాలని, శానిటేషన్, డైట్ బిల్లులు, వేతనాల చెల్లింపుల్లో జాప్యం వద్దని ఆయన తెలిపారు. డైట్ మెనూ ప్రతీ ఆసుపత్రిలో డిస్ ప్లే చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.