పసిడి ధరలు మరింత పైపైకి చేరుకుంటున్నాయి. నేడు తులం పసిడి ధర రూ. 170 పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,988, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,155 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ.91,550 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగింది. దీంతో రూ. 99,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Shubhanshu Shukla: ఐఎస్ఎస్ కి వీడ్కోలు!.. శుభాంశు శుక్లా నేడు భువి పైకి తిరుగు ప్రయాణం..
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,030 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది.