*నేడు గుడివాడలో జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే కాంస్య విగ్రహల ఆవిష్కరణ..హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, ఎమ్మెల్యే కొడాలి నాని
* విజయవాడలో నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..హాజరుకానున్న సీఎం జగన్..నేటి నుంచి 17 వరకు జరగనున్న కార్యక్రమం
* జీఓ 1 పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు..రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ…ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF..జీఓ1 కొనసాగించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ తిలక్
*అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
*నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న జగన్..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
*నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీ.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
*నేడు శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవగా అమ్మవారి కుంకుమార్చన సేవ..ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనకు 220 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు ఏర్పాట్లు.. కుంకుమార్చన అనంతరం తెల్లరేషన్ కార్డు భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి
* నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి రాహువు, కేతువు, కాలసర్ప పూజలు ప్రారంభం
*నేటి నుంచి కమలాపురం వజ్రాల సుంకులమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
*నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద ఖాళీ స్థలంలో 2023 మహానాడు నిర్వహణ ప్రాంగణానికి భూమి పూజ..హాజరు కానున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు , ఇతర టీడీపీ రాష్ట్ర నాయకులు
*తాడేపల్లిగూడెంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
