Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

Today Events May 07, 2023

* ఊపందుకున్న కర్నాటక ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి తుది గడువు..బీజేపి తరపున ప్రచారం లోకి సినీనటులు సుదీప్, నమిత ల రోడ్ షో

*ఒకే రోజు బెంగళూరులో మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం వుండటం తో బెంగుళూరు సిటిలో భారీ భద్రత ఏర్పాట్లు

* కర్నాటకలో బీజేపీ అగ్రనేతల ప్రచారం ప్రధాని నరేంద్ర మోడీ, నడ్డా, నిర్మలా సీతారామన్, ఇవాళ బెంగుళూరు గంటన్నర పాటులో 9 కిలోమీటర్ల రోడ్ షో..ఉదయం 10 గంటలకి బెంగళూరులో తిప్పసంద్ర కెంపేగౌడ విగ్రహం దగ్గర నుంచి ట్రినిటి సర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో…బెంగుళూరు లో రోడ్ షో తర్వాత శివమొగ్గ, నంజన గుడి లోని బహిరంగ సభలో ప్రధాని ప్రచారం.. ఈ రెండు సభలతో కర్నాటకలో ముగియనున్న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

* కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం బెంగుళూరు మకాం వేసిన ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు

* ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నీట్- 2023 పరీక్షకు ఏర్పాటు పూర్తి…మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్ష..మధ్యాహ్నం 11.30 నుంచి 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి.

* గుంటూరులో నేటి నుండి పది రోజులపాటు యూటీఫ్ కార్యాలయంలో ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు…

* నేడు గుంటూరులో జనంలోకి జనసేన, జనం కోసం జనసేన పేరుతో ప్రజా సమస్యలపై సమరభేరి కార్యక్రమం

*నేడు రాజమండ్రిలో భారత న్యాయవాదుల సంఘం 11వ రాష్ట్ర స్థాయి సదస్సు.. ముఖ్య అతిధిగా హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి

*నేడు రాజమండ్రిలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఆర్యవైశ్యప్రతినిధుల సమావేశం..వైశ్య ప్రముఖులచే ఆర్య వైశ్యుల ఐక్యత , సమస్యల పరిష్కారం కోసం చర్చ

*నేడు గుడివాడకు మంత్రి రోజా ఈ నెలల 19న గుడివాడలో సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించనున్న రోజా

* కృష్ణా జిల్లాలో ఏ. కొండూరు పిఏసీఎస్ లో మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం నేడు ప్రారంభం

* మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు….0891-2590100 ; 2590102..2590104 ఈ నంబర్లుకు సంప్రదించి వివరాలు అందించాలని అధికారుల విజ్ఞప్తి

* విశాఖ నగరానికి చేరుకున్న నాగేంద్రబాబు..ఇవాళ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన బహిరంగ సభ…..అనకాపల్లి నుంచి రోడ్ షో నిర్వహించనున్న జనసేన

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల పర్యటన….సిద్దిపేటలో వెటర్నరీ కాలేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు..మత్స్యకారులకు గుర్తింపు కార్డులు, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు అందజేయనున్న మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్

* విశాఖ నేడు విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి…కృష్ణదేవిపేటలోని అల్లూరి సమాధుల దగ్గర నివాళులు అర్పించనున్న ప్రముఖులు….ర్యాలీ నిర్వహించనున్న బీజేపీ

* ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ లు.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ రాత్రి 7.30కి అహ్మదాబాద్ లో మ్యాచ్.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్.. జైపూర్ లో మ్యాచ్

Exit mobile version