* బెజవాడలో యూఏఈ అంబాసిడర్…నేడు దుర్గమ్మ దర్శనం తర్వాత ఏపీ సీఎం జగన్ ను కలవనున్న అంబాసిడర్
*నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు…ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంకు చేరుకోనున్న స్వామివారు
* ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం.. వాడవాడలా కార్మికుల వేడుకలు.. ఎర్రజెండాలతో వివిధ కర్మాగారాల ప్రాంగణాలు
*నేడు రాజమండ్రిలో వామపక్షాలకు ఆధ్వర్యంలో 137వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు..మేడే సందర్భంగా కార్మికుల ప్రదర్శన, బహిరంగ సభ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాక..ఎర్ర జెండాలతో ఎరుపెక్కిన రాజమండ్రి
*కళ్యాణదుర్గం పట్టణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
*ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు
* ద్వారకా తిరుమల వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు అంకరార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్న అర్చకులు
* తాడేపల్లిగూడెంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన..ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ అనే ప్రారంభించనున్న మంత్రి బుగ్గన
*ఈ నెల 24న శ్రీ హరికోట నుంచి GSLV F-12 రాకెట్ ప్రయోగం..దేశీయ నావిగేషన్ సేవల కోసం IRNSS 1-J ఉపగ్రహం ప్రయోగం..మొదలైన రాకెట్ అనుసంధాన ప్రక్రియ
* అమరావతి R5 జోన్ అంశంపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ..రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను వేరే వారికి కేటాయించవద్దని దాఖలైన పిటిషన్..నేడు విచారణ చేయనున్న ధర్మాసనం
* గాజువాక లంకా గ్రౌండ్ లో టీడీపీ బహిరంగ సభ….కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సభలో పాల్గోనున్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ ముఖ్యులు
* విశాఖలో నేడు APCPSEA ఆధ్వర్యంలో CPSకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఉప్పెన…ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ వరకు ర్యాలీ, బహిరంగ సభ
* కడపలో నేటి నుంచి కడప-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సర్వీస్..ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆర్టీసీ ఛైర్మెన్ మల్లికార్జున రెడ్డి
* ఇవాళ లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 కి అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
* సూడాన్ నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ కావేరి..నేడు మరికొంత మంది భారతీయుల తరలింపు.
* కవిత ఈడీ పిటిషన్‌పై మే 8న సుప్రీంకోర్టులో విచారణ ఈడీకి వ్యతిరేకంగా కవిత పిటిషన్‌పై మే 8న సుప్రీంకోర్టులో విచారణ
* నేడు కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో విడుదల పాల్గొననున్న నడ్డా, సీఎం బొమ్మై, యడ్యూరప్ప
* కర్ణాటక ఎన్నికల తర్వాత సమావేశం కానున్న ప్రతిపక్షాలు, విపక్ష కూటమి ఏర్పాటుపై చర్చ
* తెలంగాణ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష ఇరిగేషన్ శాఖపై ఇవాళ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష
* తెలంగాణలో భారీ వర్షాలు..రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్.
* ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటన.. పాలేరు నియోజకవర్గాల్లో పంట నష్టం పరిశీలన, రైతులతో ముచ్చట.
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్‌రావు
* భువనగిరిలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర.. ఆలేరు నుంచి రఘునాథపురం వరకు నేడు భట్టి పాదయాత్ర