*కాసేపట్లో రెండో రోజు ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర.రోజూ రెండు విడతలుగా రాహుల్ పాదయాత్ర. తొలుత ఉదయం7నుండి 11గంటల వరకు..మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు సాగనున్న రాహుల్ పాదయాత్ర
* నేడు ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ‘కర్తవ్య పథ్’ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ.
*విజయవాడలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి కౌలు రైతుల సదస్సు
* విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఈఏపిసెట్ ఎన్ సీసీ, దివ్యంగులు, క్రీడాకారుల కోటలోని అభ్యర్ధుల సర్టిఫికెట్స్ పరిశీలన
* నేటి నుంచి విజయవాడలో 18 వ తేదీ వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూలపాడులో అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ పోటీలు
* కర్నూలులో వినాయక నిమజ్జనం..రాంబోట్ల దేవాలయం నుంచి ప్రారంభంకానున్న వినాయక శోభాయాత్ర..వినాయక ఘాట్ లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
* ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాదిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
*తిరుపతిలో నేడు ఎంఆర్ పల్లెలో టిడిపి అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవం
* నేడు చంద్రగిరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
* గుంటూరులో నేడు జేకేసీ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు…స్వామి వారి లడ్డూ వేలం నిర్వహించనున్న ఉత్సవ కమిటీ….
*తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన ..రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొననున్న వెంకయ్య నాయుడు
*నేడు సంగారెడ్డిలో జగ్గారెడ్డి భారత్ జోడో యాత్ర..గణేష్ గడ్డ నుంచి సంగారెడ్డిలోని గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేయనున్న జగ్గారెడ్డి