Today (05-01-23) Stock Market Roundup: సెన్సెక్స్ క్రాష్.. 1200 పాయింట్లకు పైగా మటాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (05-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్‌లతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది.
నిఫ్టీ50 కూడా 18 వేల మార్క్ నుంచి పతనమై 17 వేల 950కి డౌన్ అయింది. సెన్సెక్స్ నిన్న, ఇవాళ రెండు రోజుల్లోనే 12 వందలకు పైగా పాయింట్లు కుప్పకూలటం గమనించాల్సిన విషయం. సెన్సెక్స్ చివరికి 304 పాయింట్లు కోల్పోయి 60 వేల 353 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17 వేల 992 పాయింట్ల వద్ద ముగిసింది.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
read more: India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
బీఎస్ఈలో ఇంజనీర్స్ ఇండియా, సియెట్, అపోలో టైర్స్ అధికంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఏబీబీ, బజాజ్ ఫైనాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఫర్వాలేదనిపించాయి. నిఫ్టీలో ఎక్కువ శాతం స్టాక్స్ రాణించాయి. సిప్లా, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ విన్నర్స్‌గా నిలిచాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నీరసించాయి.
ఓవరాల్‌గా.. ఐటీసీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, టైటాన్ల షేర్లు కూడా బాగా డీలా పడ్డాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ దాదాపు ఒకటిన్నర శాతం లాభపడింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ జీరో పాయింట్ 8 శాతం వెనకబడింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే బజాజ్ ఫైనాన్స్ షేర్ల విలువ భారీగా.. అంటే.. 8 శాతానికి పైగా తగ్గింది.
ఈ సంస్థ వెల్లడించిన తన నిర్వహణలో ఉన్న ఆస్తుల వివరాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్లు లేకపోవటం పెద్ద మైనస్ అయింది. 10 గ్రాముల బంగారం రేటు 192 రూపాయలు తగ్గి గరిష్టంగా 55 వేల 575 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 840 రూపాయలు నష్టపోయి 68 వేల 478 రూపాయల వద్ద స్థిరపడింది. రూపాయి వ్యాల్యూ 25 పైసలు పతనమైంది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 56 పైసలుగా నమోదైంది.
తాజావార్తలు
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!