NTV Telugu Site icon

Suicide Attempt: చావు బతుకుల్లో రిషబ్ పంత్‌ను కాపాడిన యువకుడు.. కారణమేంటంటే..?

Pant

Pant

టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.

Read Also: Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..

ఆ యువకుడు అతని ప్రేమికురాలితో సంబంధం విషయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. అతని ప్రేమికురాలు మను కశ్యప్, రజత్‌ 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అయితే.. వారి కుటుంబాలు వేర్వేరు వర్గాలు కావడంతో వారి ప్రేమను అంగీకరించలేదు. అంతేకాకుండా.. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో.. గత మూడు రోజుల క్రితం ఈ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం బాలిక తల్లి తన కూతురికి విషం ఇచ్చి చంపేశాడని ఆ యువకుడిపై ఆరోపించింది. అయితే ప్రేమలో వైఫల్యం కారణంగా వారిద్దరూ ఈ చర్య తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుచ్చా బస్తీ గ్రామంలో నివసించే 21 ఏళ్ల మను కశ్యప్, షెడ్యూల్డ్ కులానికి చెందిన 25 ఏళ్ల రజత్ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో, వారి కుటుంబాలు పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా.. వారి పేరెంట్స్ తమ పెళ్లి కోసం ప్లాన్ కూడా చేశారు. ఈ క్రమంలో.. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Read Also: Aghathiyaa Trailer: “120 ఏళ్ల క్రితం ఆత్మలని కలవాలనుకుంటున్నారా?” ‘అగత్యా’ ట్రైలర్ చూసేయండి..

కాగా.. రజత్, అతని స్నేహితుడు నిషు.. పంత్‌ రోడ్డు ప్రమాదం బారిన పడినప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేశారు. కాగా.. తనను ఆస్పత్రిలో చేర్పించి కాపాడినందుకు పంత్ వారిద్దరికీ ఒక స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు.