TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!
- తమిళనాడులో వివాదస్పదంగా 'TN 2026' సినిమా
- విజయ్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసారంటూ అభిమానులు ఫైర్
- సినిమా కాదు, పొలిటికల్ అటాక్ అంటూ ఫాన్స్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వేళ టీవీకే అధినేత, హీరో విజయ్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసారంటూ దళపతి అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా ట్రైలర్‌లో కనిపిస్తున్న సన్నివేశాలు రాజకీయ పార్టీ స్థాపన నుంచి వ్యక్తిగత జీవితంపై సూచనలు వరకూ ఉండటంతో.. ఇది కేవలం సినిమా కాదు, పొలిటికల్ అటాక్ అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు దగ్గర వాళ్లేనన్న ప్రచారం వివాదాన్ని మరింత రాజేసింది.
తమిళనాడులో ‘TN 2026’ సినిమా తీవ్ర వివాదస్పదంగా మారింది. పోలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్‌లో విజయ్ సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను పోలి ఉండే సన్నివేశాలు ఉన్నాయంటూ టీవీకే వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు సన్నిహితులేనన్న ప్రచారం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే విజయ్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ప్రస్తుత రాజకీయాలపై వినోదాత్మకంగా వ్యాఖ్యానించడమే లక్ష్యమని చిత్రబృందం వివరణ ఇస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. విజయ్ తరహా వేషధారణ, అగ్రహీరో రాజకీయ పార్టీ స్థాపన, సినీ నటుల రాజకీయాలపై సంభాషణలు, ప్రముఖ నటితో సన్నిహితంగా చూపించిన దృశ్యాలు వివాదానికి దారితీశాయి.
Also Read
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ట్రైలర్‌పై టీవీకే నాయకులు తీవ్రంగా స్పందించారు. ‘మా నాయకుడిని విమర్శించే సినిమాను అడ్డుకుంటాం’ అంటూ హెచ్చరించారు. డీఎంకే పార్టీ కోలీవుడ్‌పై ప్రభావం చూపుతోందని ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ వివాదం ఎన్నికల దిశగా మళ్లింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దేశీయ మక్కల్ శక్తి కచ్చి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీకి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. సినిమా విడుదల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విడుదలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!