TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Rebellion: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ సెగలు అస్సలు తగ్గడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడుతున్న సమస్యలు ఆమెను తీవ్ర అగ్నిపరీక్షలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవలే బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి గట్టి షాక్ తగిలింది. రితబ్రత్ బెనర్జీ నాయకత్వంలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి, పార్టీ నుంచి విడిపోయారు. ఈ సంక్షోభం ఎంత పెద్దదంటే, స్పీకర్ సైతం రితబ్రత్ బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించక తప్పలేదు. ఇది టీఎంసీ చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ అంతర్గత సంక్షోభంగా ఇది నిలిచింది. అయితే, ఈ అసెంబ్లీ ముసలం ఇక్కడితోనే ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ తిరుగుబాటు సెగలు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌కు సైతం పాకేలా కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. శాసనసభలో జరిగిన ఘోర పరాభవం తర్వాత, ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లోని టీఎంసీ ఎంపీలు సైతం అదే బాటలో నడుస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత తక్కువ సమయంలో అంతమంది ఎమ్మెల్యేలు విడిపోవడం చిన్న విషయం కాదని, అలాంటి పరిణామాలే లోక్‌సభలోనూ పునరావృతమయ్యే ముప్పు ఉందంటూ బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏం జరుగుతుందనే దానిపై స్పష్టమైన జోస్యం చెప్పనప్పటికీ, అక్కడ సైతం తిరుగుబాటు వచ్చే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేమని అనడం గమనార్హం.
అంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమే: సీనీయర్ ఎంపీ సౌగతా రాయ్!
మరోవైపు, ఈ సంక్షోభాన్ని సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని మండిపడుతున్నారు. బెంగాల్ అసెంబ్లీలో ఏ కుతంత్రాలైతే ప్రయోగించారో, అవే వ్యూహాలను పార్లమెంట్‌లోనూ అమలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ మమతా బెనర్జీపై తనకు పూర్తి నమ్మకం ఉందని, గతంలోనూ ఆమె ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఫీనిక్స్ పక్షిలా దూసుకొచ్చారని, ఈసారి సైతం గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం ఎపిసోడ్లో బారాసత్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్‌సభలో ఆమెను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆమె తిరుగుబాటు గ్రూపు వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నా, ఆమె మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన దీదీ.. రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె స్వయంగా ఫోన్లలో మాట్లాడుతూ బుజ్జగిస్తున్నారు. పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు చేజారిపోకుండా చూసే బాధ్యతను తన ఇద్దరు అత్యంత నమ్మకస్తులైన ఎంపీలకు అప్పగించి, నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
పార్లమెంట్లో టీఎంసీ బలం ఎంతంటే..?
ఇక, ప్రస్తుతం పార్లమెంట్లో టీఎంసీ బలాన్ని చూస్తే.. లోక్‌సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, ఒకవేళ ఎంపీలు విడిపోవాలనుకుంటే కనీసం మూడో వంతు (2/3) మంది సభ్యులు వేరే గ్రూపుగా మారాల్సి ఉంటుంది. అప్పుడే వారి పదవులకు ముప్పు ఉండదు. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రెండు రకాల వ్యూహాలపై చర్చ నడుస్తోంది. ఒకటి ‘రితబ్రత్ మోడల్’.. అంటే మెజారిటీ ఎంపీలంతా కలిసి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి, తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకోవడం. రెండోది, నేరుగా వెళ్లి మరో పెద్ద పార్టీలో విలీనమైపోవడం. అయితే కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినంత మాత్రాన పార్టీ గుర్తు, సంస్థాగత నిర్మాణంపై హక్కులు దక్కవు. తామే అసలైన పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ రాజకీయ రణరంగం ఇప్పుడు కోల్‌కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!