Tirupati Svims Hospital: తిరుపతి స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా క్యాజువాల్టీ ముందే ఓ టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి చెందారు. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్ తన తండ్రి గోపీనాయక్ కు గుండెనొప్పి రావడంతో బుధవారం మధ్యాహ్నం ఆటోలో స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ సమయంలో అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లడానికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఆటోడ్రైవర్ సాయంతో లోపలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఆటోడ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని సెక్యూరిటీ వారిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.. తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని, సహకరించాలని చంద్రానాయక్ సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గోపీనాయక్ కి మరోసారి గుండెపోటు రావడంతో క్యాజువాలిటీ ముందే ప్రాణాలు విడిచారు.
Read Also: Himanta Biswa Sharma: వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపై అసలు కారణం చెప్పిన అసోం సీఎం
ఇక, తన తండ్రి మరణానికి సెక్యూరిటీ సిబ్బందియే కారణమంటూ చంద్రా నాయక్ వాగ్వాదానికి దిగారు. దీంతో మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి చంద్రానాయక్ పై దాడికి యత్నించారు.. అయితే, చంద్రానాయక్ తమపై దాడి చేశారని ఆరోపిస్తూ సెక్యూరిటీ సిబ్బంది రుయాస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వెస్ట్ పోలీసులు.. స్విమ్స్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.. స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది వల్లే.. తన తండ్రి ప్రాణాలు పోయాయని చంద్రానాయక్ మండిపడుతున్నాడు. స్విమ్స్ లో పలు సందర్భాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూసినట్టు ఆరోపణలు ఉన్నాయి.