తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో డాక్టర్లు ధర్నాకు దిగారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.