Site icon NTV Telugu

Tirupati: విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు!

Mbu

Mbu

Tirupati: తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినోద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

GITAM University: గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ

ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసి అడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.

Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..

విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version