Site icon NTV Telugu

Andhrapradesh: సీఎం జగన్‌తో తిరుపతి ఎమ్మెల్యే భూమన భేటీ.. కీలక పదవిపై చర్చలు!

Mla Bhumana Karunakar Reddy

Mla Bhumana Karunakar Reddy

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భూమన భేటీ అయ్యారు. వచ్చే నెల 12తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే భూమన.. టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎంతో సమావేశమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని భూమన కరుణాకర్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

Also Read: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ను భూమన కోరినట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ఛైర్మన్ సహా పాలక మండలి సభ్యుల నియామకాలపై కూడా చర్చ జరిగినట్లు పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Exit mobile version