Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
- తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం
- ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం
- ఏందుకు మనకీ అయోమయం అంటూ మరో ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj vs Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా మరో పోస్ట్ చేశారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?. జస్ట్ ఆస్కింగ్?..’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20న పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దయచేసి దర్యాప్తు చేయండి.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోండి. అనవసర భయాలు కల్పించి.. దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా మీరెందుకు చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. జస్ట్ ఆస్కింగ్’ అని పేర్కొన్నారు.
Also Read
Also Read: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!
ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని అన్నారు. దీనిపై ప్రకాశ్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు.. నేను మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పిందాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత భారత్ వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే.. నా ట్వీట్‌ను మళ్లీ చదవి అర్థం చేసుకోండి’ అని అన్నారు. అనంతరం హీరో కార్తీ సారీ చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్’ అని మరో ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేశారు.
గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు