‘దేవర’ ఊచకోతకు సముద్రం ఎరుపెక్కగా.. ఫ్యాన్స్ తాకిడికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఎరుపెక్కనున్నాయి. మరో కొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరంను దాటనుంది. మేకర్స్ ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. దేవర నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా అంచనాలను మించాయి. సినిమా ఓపెనింగ్ రోజే.. మృగాల వేట చూస్తారని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. అందుకు తగ్గట్టే టీజర్‌లో బ్లడ్ మూన్ షాట్‌తో హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లిన కొరటాల.. ఫియర్ సాంగ్‌తో భయపెట్టేశారు. చుట్టమల్లే, దావూదీ సాంగ్‌లకు డిజిటల్ రికార్డ్స్ బద్దలయ్యాయి. సినిమాకే హైలెట్‌గా ఉంటుందని చెబుతున్న ఆయుధ పుజ సాంగ్‌ను థియేటర్లోనే చూడాలి. ఇక ఇప్పుడు దేవర థియేటర్లోకి రావడమే మిగిలింది.
తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని దేవరలో చూడబోతున్నాం. ఇప్పటికే టైగర్ ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియా ఎరుపెక్కింది. థియేటర్ల వద్ద ఎర్రసముద్రాన్ని తలపించేలా ప్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఇక టైగర్ కటౌట్‌లకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో.. దేవరను ఓ పండగలా ఫాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది దేవర.
Also Read: IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్ ముంగిట ఎన్ని రికార్డులో!
ఈరోజు అర్థ రాత్రి నుంచి థియేటర్ల దగ్గర దేవర జాతర మొదలు కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘దేవర జాతర బిగిన్స్’ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దమా? అని టైగర్ ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవర తమ ఆకలి తీరుస్తుందని, ఫుల్ మీల్స్ పెడుతుందనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. దేవర ఊచకోతతో థియేటర్లు ఎరుపెక్కుతాయని ధీమాగా ఉన్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై కూడా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అప్పటికే ఆయన అందించిన సాంగ్స్ ఎన్ని రికార్డులు నెలకొల్పయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొరటాల కోత, టైగర్ వేట, అనిరుధ్ మోత ఎలా ఉంటుందో చూడాలి.