Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Supreme Court

Supreme Court

Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుత దశలో తిరస్కరించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొందని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిరంతరం రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. “మా మునుపటి ఆదేశాలతో మేం ఇప్పటికే అందరినీ నిశ్శబ్దంగా ఉండేలా చేశాం. ఒకవేళ ఏమైనా అనుకోని పరిణామాలు జరిగితే, మీరు మళ్లీ మా వద్దకు రావొచ్చు” అని స్పష్టం చేశారు. ప్రస్తుత దశలో కేసు విచారణను రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయడానికి తగిన కారణాలు లేవని పేర్కొంటూ సీజేఐ ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ముగించారు.