Kidnap At Tirupati: తిరుపతి నగరంలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. తమిళనాడు నుండి వచ్చి నాలుగో భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసింది.
తిరుపతికి చెందిన మునిరెడ్డి స్థానిక చింతలచేను రోడ్డులో చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు సేకరించే దుకాణం నడుపుతున్నారు. వాటిని తీసుకొచ్చే వ్యక్తుల కోసం పక్కనే గదులు అందుబాటులో ఉంచారు.
Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్న్యూస్.. డబ్బును ఆదా చేసుకునే ఛాన్స్?
మూడునెలల కిందట శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతులు 13 నెలల శిశువు జయశ్రీతో కలసి ఇక్కడికి వచ్చారు. వారి పక్కనే తమిళనాడుకు చెందిన మురుగన్, మారెమ్మ దంపతులు ఉండేవారు. బాలికను ముద్దు చేయడం, దుకాణాలకు తీసుకెళ్లి చిరుతిళ్లు తినిపించడం, ద్విచక్ర వాహనంలో తిప్పడం చేసేవారు. ఇలా నమ్మకంగా ఉంటూనే బుధవారం ఉదయం 10.30 గంటలకు బాలికను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మధ్యాహ్నం అనంతరం పోలీసులను ఆశ్రయించారు.
Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్ బచ్చన్
నిందితుల సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా మారెమ్మ రెండో, మూడో భర్తలు, వారి పిల్లలను పోలీసులు గుర్తించి విచారించారు. ప్రస్తుతం నాలుగో భర్త మురుగన్ తో ఆమె జీవిస్తున్నట్లు వెల్లడైంది. తమిళనాడులోని వేలూరు, కాంచీపురంలో బంధువులు ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందంతో ఇద్దరికోసం గాలిస్తున్నారు. చిన్నారిని ఎవరికైనా విక్రయించడానికి తీసుకెళ్లారా.? లేక ఏదైనా కారణం ఉందా.? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.