Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- తిరుపతిలో దారుణం
- బాలికపై బాబాయ్ అత్యాచారం
- తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు కేసు బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై కామంతో కన్నేశాడు. పర్సనల్ ఫోటోలను అడ్డుపెట్టుకుని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘోరం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారంతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు వేట మొదలు పెట్టారు.
సెలవులకని తన ఇంటికి వచ్చిన కూతురు వరుస అయ్యే బాలికపై కన్నేసి కామాంధుడిలా ప్రవర్తించాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఏప్రిల్ నెలలో వేసవి సెలవుల కోసం తిరుపతిలోని తన చిన్నమ్మ (పిన్ని) ఇంటికి వెళ్ళింది. అక్కడ పిన్ని భర్త రామమూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూసిన నిందితుడు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ ఫోటోలను అడ్డుపెట్టుకుని భయపెడుతూ బాధితురాలిపై రామమూర్తి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్ళిపోయినా ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం మానలేదు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక మానసికంగా కృంగిపోవడాన్ని గమనించిన తల్లి.. నిలదీయగా అసలు విషయం బయటపడింది.
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
తన తమ్ముడు సమానుడైన బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి షాక్ తిన్నది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలం తిరుపతి కావడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ (07/2026) నమోదు చేశారు. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు బదిలీ చేశారు. తిరుపతి పోలీసులు నిందితుడు రామమూర్తిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద కఠిన సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!