Tirumala Darshanam Booking: నేడు రూ.300ల దర్శన టికెట్స్ విడుదల.. వసతి గదులు కోటా కూడా..!

  • శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త.
  • ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్లు విడుదల
  • మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి లలోని వసతి గదుల కోటా విడుదల.
Tirumala

Tirumala

Tirumala Darshanam Booking: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శన టికెట్లను నేడు (జూన్ 24) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల కానున్నాయి. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక యాప్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read Also:AP Cabinet Meeting: నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..!

అలాగే ఇక మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి లలోని వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు తమ ప్రయాణ తేదీలను అనుసరించి గదుల బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు వీలైనంత త్వరగా టికెట్లు, గదులను బుక్ చేసుకుంటే స్వామి దర్శన సమయంలో సౌకర్యంగా ఉంటుంది. ఇక సోమవారం నాడు అంగప్రదక్షణ టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Ponguleti Srinivasa Reddy: వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెబుతున్నాం..