NTV Telugu Site icon

Pawan Singh: సమయమే సమాధానం చెబుతుంది.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యలు

Pawan Sing

Pawan Sing

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమయమే చెబుతుందని బీజేపీకి చెందిన పవన్ సింగ్ అన్నారు. అసన్‌సోల్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని పవన్‌ కలిశారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నిరాకరించిన పవన్ సింగ్.. సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏది జరిగినా మంచి జరుగుతుందని పేర్కొన్నారు. తాము ఏ అంశంపై చర్చించారో అన్న విషయాలను చెప్పలేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. ఏం జరిగినా మంచి జరుగుతుందని చెప్పారు. దానికి సమయమే సమాధానం చెబుతుంది.. ఏది జరిగినా, తాము ఖచ్చితంగా మీకు చెబుతాము.. కొంచెం ఆగండని తెలిపారు.

CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు.. షెడ్యూల్ ఇదే..!

కాగా.. నిన్న బీజేపీ అధిష్టానం త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ క్రమంలో.. భోజ్పురి సింగర్, నటుడు పవన్ సింగ్ పోటీ చేయలేనంటూ భారీ షాక్ ఇచ్చారు. తనకు కేటాయించిన పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయలేనని తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి అసన్‌ సోల్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే… కొన్ని కారణాల వల్ల నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అని ఆయన ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.

Leopard: బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల.. 5 గంటలపాటు నరకయాతన

పవన్ సింగ్ చేసిన ట్వీట్ పై తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పందించారు. ఈ ఉపసంహరణ పశ్చిమ బెంగాల్ ప్రజల అద్వితీయమైన స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. మరో తృణమూల్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ.. అసలు ఆట ప్రారంభం కాకముందే బీజేపీకి దెబ్బ తగిలిందంటూ కౌంటర్ వేశారు. సింగర్, పొలిటీషియన్ బాబుల్ సుప్రియో బదులిస్తూ… పోటీ నుంచి తప్పుకోవాలంటూ పవన్‌పై బీజేపీ ఒత్తిడి చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.