Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్‌డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santosh Goyal Story: ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లుధియానవి ఓ ప్రసిద్ధ కావ్యం రాశారు.. “కాలమే పగలు రేయిని శాసిస్తుంది, కాలమే నిన్నటిని నేటిని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ కాలానికి బానిసే, ప్రతి దానిపై కాలానిదే అధికారం. వచ్చే పోయే వెలుగులన్నీ కాలానికి కట్టుబడే ఉంటాయి. కాలం ఒక్కోసారి పూల పాన్పులా సుఖాన్ని ఇస్తుంది, మరోసారి ముళ్ల కిరీటంలా నొప్పిని మిగిలిస్తుంది. అందుకే మనిషి కాలానికి భయడాలి, అది ఏ క్షణాన తన స్వభావాన్ని మార్చుకుంటుందో ఎవరికీ తెలియదు.” ఈ అద్భుతమైన కవితా పంక్తులు కేవలం ఊహలు కావని, జీవిత సత్యాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నిరూపిస్తోంది. మనం ఎంత పెద్ద ప్లాన్లు వేసుకున్నా, కాలం ముందు మనిషి ఎంత నిస్సహాయుడో ఈ కథ చదివితే అర్థమవుతుంది.
జీఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అజయ్ మిశ్రా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన సంతోష్ గోయల్ అనే ఒక వృద్ధుడితో మాట్లాడారు. సంతోష్ గోయల్ సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఇంగ్లీష్ సబ్జెక్టులో పీహెచ్‌డీ (PhD) చేసిన విద్యావంతుడు. 1971వ సంవత్సరంలో ఎన్డీయే (NDA) లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన గౌరవనీయమైన ఉపాధ్యాయుడు. ఒకప్పుడు సమాజంలో ఎంతో హోదాలో, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన ఆయన పరిస్థితి నేడు తలకిందులైంది. కంటి చూపు కోల్పోవడంతో ఉద్యోగం పోయింది. ఒకవేళ కనీసం 15 ఏళ్లు ఆ ఉద్యోగంలో కొనసాగి ఉంటే, ఈరోజు నెలకు 70 నుంచి 75 వేల రూపాయల పెన్షన్ వచ్చేదని, కానీ విధి ఆ అవకాశాన్ని ఇవ్వలేదని సంతోష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక దేవాలయంలో తలదాచుకుంటూ, అక్కడ లభించే ఆహారంతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. ఒక పీహెచ్‌డీ స్కాలర్, దేశానికి రక్షణ కల్పించే అధికారులను తీర్చిదిద్దిన గురువు నేడు ఇలాంటి స్థితిలో ఉండటం చూసి అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. సంతోష్ గోయల్‌కు తక్షణమే సహాయం అందించాలని చాలా మంది కోరుతున్నారు. ఇలాంటి వ్యధాభరితమైన గాథను వెలుగులోకి తెచ్చిన అజయ్ మిశ్రాను అభినందిస్తున్నారు. జీవితంలో దేనికీ గర్వపడకూడదని, కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ పడేస్తుందో ఊహించలేమని ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. అధికారం, హోదా, సంపద అన్నీ కాలం ఇచ్చేవే.. అవి ఏ క్షణానైనా దూరం కావచ్చనే నిజాన్ని ఈ వృద్ధుడి కథ కళ్లకు కడుతోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!