NTV Telugu Site icon

IPL 2023: ముంబై ప్లేయర్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు

Tem David

Tem David

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ తో ఈ క్యాష్ రిచ్ లీగ్ కు తెరలేచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఏ సంవత్సరం సీజన్ కోసం ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ టీమ్ డేవిడ్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసి డేవిడ్.. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Also Read : Toll Plaza Prices: మొదలైన టోల్ బాదుడు.. వాహనదారుల జేబుకు చిల్లు

అయితే ప్రాక్టీస్ సెషన్ లో టీమ్ డేవిడ్ తన హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ ను ప్రదర్శిస్తున్నాడు. గురువారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో ఏకంగా 23 పరుగులు సాధించి బౌలర్ కు చుక్కలు చూపించాడు. ఫస్ట్ బంతికి బౌండరీ బాదిన టీమ్.. రెండో బంతికి రెండు పరుగులు.. మూడో బంతికి ఫోర్, అనంతరం రెండు సిక్స్ లు, ఓ సింగిల్ తో ఓవర్ ను ముగించాడు.

Ipl

Also Read : GT vs CSK : తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం

టీమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్ కు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో టీమ్ డేవిడ్ ను రూ. 8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. అయితే ఐపీఎల్ 2022లో 8 మ్యాచ్ లు ఆడిన డేవిడ్ 186 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక ఈ ఏడాది సీజన్ లో ఏ మెరకు రాణిస్తాడో టీమ్ అనేది వేచి చూడాలి. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను రేపు ( ఏప్రిల్ 2)న బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఢీ కొట్టబోతుంది.

Show comments