Rohit Sharma React on First Class Practice Tests: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన రోహిత్ సేన ఆతిథ్య జట్టు చేతిలో దారుణ ఓటమిని మూటకట్టుకుంది. ఈ టెస్టుకు ముందు సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. వాటిని కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రాక్టీస్ టెస్టులతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.…
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో ఏకంగా 23 పరుగులు సాధించి బౌలర్ కు చుక్కలు చూపించాడు.
Virat Kohli: మైదానంలో అగ్రెసివ్‌గా ఉండే టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అతడు ఎలాంటి భావోద్వేగాన్ని దాచుకోడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దానిని బయటపెట్టేస్తుంటాడు. అందుకే విరాట్‌ను చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈనెల 23న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సమయంలో…
T20 World Cup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతూ తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.…
ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్‌తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 246/8 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, గిల్ వంటి ప్రతిభావంతులు భారీ స్కోర్లు చేయలేనిచోట తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఒక్కడే టీమిండియా పరువు కాపాడాడు. అతడు 70 పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులకు పైగా స్కోర్ చేయగలిగింది. కోహ్లీ (33), రోహిత్ (25),…
జూలై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊరట కలిగింది. కరోనా బారిన పడ్డ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా కోలుకున్నాడు. గురువారం లీసెస్టర్ షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ సెషన్‌లో అశ్విన్ పాల్గొన్న…