టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.పలు సినిమా లలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.హీరో గా పలు సినిమాలు చేసిన అంతగా ఆకట్టుకోలేదు. అయితే సిద్దూ ‘డీజే టిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అలాగే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం సిద్దూ డీజే టిల్లు సినిమా కు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా విడుదల తేదీ మేకర్స్ వెల్లడించారు.
‘టిల్లు స్క్వేర్’ తో మరోసారి టిల్లు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరించనున్నారు. మొదటి సినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ఇప్పుడీ సినిమా లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ తాజాగా వెల్లడించారు.’టిల్లు స్క్వేర్’ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత గా వ్యవహారిస్తున్నారు..శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాల పై ‘టిల్లు స్క్వేర్’ సినిమా తెరకెక్కుతోంది. ‘డీజే టిల్లు’ తరహా లో ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకుంటుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సారి మరింత ఫన్ టాస్టిక్ గా సినిమాను రూపొందించినట్లు సమాచారం.