NTV Telugu Site icon

Asia Cup 2023: వన్డేల్లో అరంగేట్రం చేస్తానని అస్సలు అనుకోలేదు.. రోహిత్‌ భయ్యా వల్లే ఇదంతా: హైదరాబాదీ ప్లేయర్

Tilak Rohit Mi

Tilak Rohit Mi

Tilak Varma Said Captain Rohit Sharma always backed me Even in the IPL Also. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20లతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌ వర్మ.. ఇప్పుడు వన్డే జట్టులోకి వచ్చేశాడు. ఆసియా కప్‌ 2023 కోసం ఎంపిక చేసిన 17 మంది ఆటగాళ్ల జాబితాలో తిలక్‌ చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20లలో 20 ఏళ్ల తిలక్‌ గొప్ప పరిణతితో బ్యాటింగ్‌ చేయడమే వన్డేల్లో చోటు దక్కేలా చేసింది. ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉన్న అతడు ఏన్సీఏలో ఆగస్టు 24 నుంచి ఆరంభం కానున్న ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గోనున్నాడు. ఆసియా కప్‌కు ఎంపిక కావడంపై తిలక్‌ స్పందించాడు. వన్డేల్లో ఇంత త్వరగా అరంగేట్రం చేస్తానని అస్సలు అనుకోలేదని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మద్దుతుగా నిలిచాడు అని తిలక్‌ చెప్పాడు.

ఆసియా కప్‌ 2023కి ఎంపికయిన అనంతరం బీసీసీఐ టీవీతో తిలక్‌ వర్మ మాట్లాడుతూ… ‘ఆసియా కప్‌ వంటి పెద్ద ఈవెంట్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తానని నేను అస్సలు ఊహించలేదు. భారత్ తరఫున వన్డేల్లో ఆడాలని ఎప్పటినుంచో కలలు కంటున్నా. నా కల త్వరలోనే నేరవేరబోతోంది. ఇది నాకు చాలా పెద్ద విషయం. చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే టీ20ల్లో అరంగేట్రం చేశాను. నెల తిరగకముందే ఆసియా కప్‌కి ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా’ అని తెలిపాడు.

‘ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ భాయ్‌ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌ ఆరంభంలో నేను ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో రోహిత్‌ నాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా.. నీ ఆట నువ్ ఆడమని సలహా ఇచ్చాడు. ఏదైనా సహాయం కావాలంటే.. ఎప్పుడైనా నాకు కాల్ లేదా మెసేజ్ చేయమని చెప్పాడు. నేను రోహిత్‌ భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చకున్నా. భారత్ తరఫున బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని హైదరాబాదీ ఆటగాడు తిలక్‌ వర్మ చెప్పాడు.

Also Read: Poco M6 Pro 5G Price: పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ సేల్ మూడోసారి ఆరంభం.. క్రేజ్ మాములుగా లేదుగా!

ఆసియా కప్‌ 2023కి భారత్‌ జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ. సంజు శాంసన్‌ (బ్యాకప్‌ కీపర్).