Tilak Varma: ‘వరల్డ్ కప్ నా డ్రీమ్”.. రీ-ఎంట్రీపై తెలుగు తేజం తిలక్ వర్మ భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma: మారికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ వరల్డ్ కప్‌కు భారత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ కప్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని టీమిండియా సహాయశక్తులా ప్రయత్నిస్తోంది. భారత్ జట్టులో అందరూ ఫామ్‌లోనే ఉన్నారు. అయితే.. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుగు తేజం తిలక్ వర్మ రీ-ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఇటీవలే కోలుకొని టీమ్ఇండియా వరల్డ్‌కప్ జట్టుతో చేరాడు. వచ్చీ రాగానే బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. బుధవారం నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మ్-అప్ మ్యాచ్ ఒక ఆటగా మొదలై, భావోద్వేగ కథలా ముగిసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తిలక్ వర్మకు ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కాదు. తన కలలకు పునర్జీవనం పోసిన రోజుగా మిగిలిపోయింది.
READ MORE: PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం..
Also Read
- Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
ఇటీవలే రిహ్యాబిలిటేషన్ పూర్తి చేసుకున్న తిలక్, ఇంత త్వరగా మైదానంలోకి వస్తానని తానే ఊహించలేదట. ఈ మ్యాచ్ అనంతరం తన రికవరీ తిలక్ మాట్లాడాడు. “నిజం చెప్పాలంటే, నేను ఇంత తొందరగా తిరిగి ఆడతానని అనుకోలేదు” అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో చెప్పాడు. తాను ఇంత త్వరగా కోలుకుని గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వడంలో బీసీసీఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాత్ర కీలకమని గుర్తు చేశాడు తిలక్. తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. వరల్డ్ కప్ ఆడటం తన అతిపెద్ద కల అని చెప్పాడు. “నేను ఇంత త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి వస్తానని అస్సలు ఊహించలేదు. ఇంత త్వరగా కోలుకోవడానికి సహకరించిన బీసీసీఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచ కప్‌లో ఆడటం నా కల అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను మైదానంలోకి రాగేనే అందరూ ‘తిలక్ తిలక్’ అని అరుస్తున్నారు. ఆ క్షణం నాకు చాలా బాగా అనిపించింది. నాకు మరింత ఉత్సాహం వచ్చింది. ఆ మూమెంట్‌ను నిజంగా ఆస్వాదించా. నేను నడుస్తున్నప్పుడు అది నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఇషాన్, అభిషేక్‌తోపాటు మిగిలిన వాళ్లు బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించాను. భారీ షాట్లు కొట్టగలనని నాకు నమ్మకం కలిగింది” అని తిలక్ వర్మ అన్నాడు. కాగా.. సరైన సమయంలో తిలక్ వర్మ రీటర్న్ భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు జట్టు దృష్టి మొత్తం వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌పైనే ఉంది. శనివారం అమెరికాతో జరిగే మ్యాచ్‌కు ముందు, తిలక్ వర్మ కథ జట్టుకే కాదు, అభిమానులకూ మంచి నమ్మకాన్ని పెంచింది. గాయం నుంచి తిరిగి వచ్చి, చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఈ తెలుగు యువకుడు అద్భుతంగా రాణించాలని, జట్టు విజయానికి కీలకంగా నిలవాలని కోరుకుందాం..
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?