A medal is assured for India in cricket in Asian Games 2023: 2023 ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో శుక్రవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (40) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (55) హాఫ్ సెంచరీ బాదాడు. ఈ విజయంతో భారత్‌కు క్రికెట్‌లో పతకం ఖాయం అయింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. నేపాల్‌పై సెంచరీ చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 4 బంతులు ఆడిన యశస్వి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జత కలిశాడు. ఇద్దరు కలిసి బౌండరీలు, సిక్సులు బాది స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ముఖ్యంగా తిలక్ సిక్సులు వర్షం కురిపించాడు. దాంతో భారత్ సునాయాస విజయం అందుకుంది.
Also Read: ODI World Cup 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. భారత్‌కు భారీ షాక్! ఓపెనర్‌గా ఇషాన్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. జాకర్ అలీ (24), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (23)లు టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
A formidable 9️⃣-wicket win over Bangladesh and #TeamIndia are through to the #AsianGames Final! 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/75NYqhTEac#IndiaAtAG22 pic.twitter.com/SsRVenSNmu
— BCCI (@BCCI) October 6, 2023