NTV Telugu Site icon

Tiger Scare: పులి అడుగు జాడలు గుర్తించిన అధికారులు.. భయాందోళనలో ప్రజలు

Tigerscare

Tigerscare

Tiger Scare: కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి దాడితో రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అధికారులకు మొర పెట్టుకోవడంతో పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భీంపూర్, నార్లపూర్ దారి మధ్యలో పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాద ముద్రలు పెద్ద పులికి చెందినవా.. లేదా చిరుత పులికి చెందినవా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

మంగళవారం వాంకిడి మండలం ఖానాపూర్​ గ్రామానికి చెందిన సీడాం భీమ్​(69) అనే వ్యక్తి పత్తి చేనులో పత్తి తీసేందుకు వెళ్లగా.. పులి అకస్మాత్తుగా అతడిపై దాడికి పాల్పడి, కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్లింది. దానితో భీమ్​ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. అదే పులి ఉదయం పూట పశువులు కాస్తున్న కాపరులకు కనిపించిందని వారు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలియజేశారు. ఎలాగైనా పులిని పట్టుకోవాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.

Telangana Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. తుది కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులుల సంచారం పెరిగింది. మొన్న 4 పులులు భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ సమీపంలో సంచరిస్తూ.. స్థానికులను కునుకులేకుండా చేశాయి. అయితే.. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్‌కు రాత్రి సమయంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ దగ్గర 4 పులులు కనిపించాయి. అంతేకాకుండా.. ఇప్పటికే కొరాట, గూడా, రాంపూర్, తాంసి, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు పంట పొలాలకు పులుల భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో.. ఇటీవల భీంపూర్ మండలంలో గుంజాల సమీపంలో ఆవుపై దాడి చేసి చంపాయి. వారం క్రితం చెనాక కొరటా పంప్ హౌస్ సమీపంలో 2 పులులు కనిపించగా.. ఇవాళ వాంకిడి మండలం ఖానాపూర్‌లో పులి రైతుపై దాడి చేసి చంపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులులను పట్టుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. అయితే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా.. పులిలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Show comments