Tiger Tension: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను పెద్దపులి గత కొంతకాలంగా వణికిస్తోంది. కొద్ది రోజులుగా పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుంది సమీప గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా, నల్లజర్ల మండలం పోతవరంలో కూడా పెద్దపులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పొలంలో పులిపాద ముద్రలతో పాటు, ఫెన్సింగ్ దాటిన సమయంలో తీగలకు చిక్కిన పెద్దపులి జుట్టును గుర్తించారు స్థానిక రైతులు. దీంతో, ఎప్పుడు..? ఎక్కడి నుంచి? ఎలా? ఆ పులి దాడి చేస్తుందోనంటూ భయాందోళనకు గురవుతున్నారు.. ఇక, ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు స్థానికులు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటికి వచ్చిన పెద్దపులి దెందులూరు వరకు సంచరించింది. ఆ తర్వాత పుల తిరుగు ప్రయాణంలో ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు చోట్ల పశువులపై దాడి చేసి తినేసింది పెద్దపులి. దాని కదలికలను ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. పులి సంచారం తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.. పులికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తమకు వెంటనే చేరవేయాలని.. భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని ధైర్యం చెబుతున్నారు. అయితే, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు.. పశువులను, గొర్రెలను పొలానికి తీసుకెళ్లేవారు.. పొలం పనులకు వెళ్లే కూలీలు, స్థానిక గ్రామాల ప్రజలు అంతా పులి భయంతో ఆందోళనకు గురిఅవుతున్నారు.
Read Also: Budget 2024 : బడ్జెట్ రోజున ఆకట్టుకున్న నిర్మల సీతారామన్ చీర