Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
- పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం
- లింగవరం పరిసరాల్లో పులి కదలికలు
- జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం లింగవరం పరిసరాల్లో పులి కదలికలు గుర్తించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి తర్వాత నాగాలపల్లి ప్రాంతానికి చేరిన పులి.. ఉదయం నుంచి అదే పరిసరాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. గానుగులగొందు ముంపు గ్రామంలో ఓ ఆవుపై పులి దాడి చేసిన ఘటన మరింత ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై రేడియో టెలిమెట్రీ పరికరాల ద్వారా పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. నాగాలపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో పులి పాదముద్రలు కూడా గుర్తించారు.
అటవీ శాఖ అంచనా ప్రకారం.. ఈ రాత్రి పులి చిన్నారిగండి, శరభవరం, గండికోట ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చీకటి పడేలోగా ఇళ్లకు చేరుకోవాలని గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తోటలకు వెళ్లే రైతులు, బయట పనులు చేసే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే.. గండిపోశమ్మ ఆలయానికి వెళ్లే భక్తుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పులి సంచారం నేపథ్యంలో ఆలయానికి వెళ్లే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం పరిస్థితిని అటవీ శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు.
Also Read
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!