NTV Telugu Site icon

Tiger Attack : వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. సర్కస్‎లో వ్యక్తి మెడ కొరికేసిన పులి

Tiger Attack

Tiger Attack

Tiger Attack : ఇటాలియన్ ప్రావిన్స్ లో ఏర్పాటు చేసిన సర్కస్ ప్రదర్శనలో అనుకోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక పులి ఉన్నట్లుండి సర్కస్ ట్రైనర్ పై దాడి చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన క్లిప్‌లో సర్కస్ ట్రైనర్ మరొక పులిపై దృష్టి కేంద్రీకరించనట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి మరొక పులి అతడి వెనుకనుంచి దాడికి పాల్పడింది. అతడిని ఇవాన్ ఓర్ఫీగా గుర్తించారు. ఇవాన్ నొప్పితో అరుస్తూ, పులి బారి నుండి తప్పించుకునేందుకు విపరీతంగా పోరాడాడు. ఈ పోరాటంలో పులి అతడి మెడను కొరికేసింది. దాడిలో అతడి కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

Read Also: Rahul Gandhi: ప్రియాంకకు ముద్దు పెట్టిన రాహుల్ ఫోటో వైరల్

అదృష్టవశాత్తూ ఇవాన్ పులి బారి నుండి తప్పించుకున్నాడు. అతని సహాయకుడు పులిని టేబుల్‌తో కొట్టి అతడిని విడిపించాడు. తీవ్ర గాయాలైన ఇవాన్ ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఇంకొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని సమాచారం. సర్కస్ లో ఎప్పుడు ఇలా జరుగకపోవడంతో ప్రదర్శన తర్వాత పులిని పశువైద్య పరీక్షలు చేయించడానికి ఒంటరిగా ఉంచారు. అనంతరం సర్కస్ మేనేజ్ మెంట్ ఇవాన్ ఓర్ఫీ అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ ట్రైనర్ అని ప్రస్తుతం అతని పరిస్థితి బాగుందని ప్రకటించింది.

Show comments