Tiger 3 : అదిరిపోయే స్టంట్స్ తో ఆకట్టుకుంటున్న టైగర్ 3 ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 16) విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న టైగర్ 3 మూవీతో మరోసారి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు.. 2017లో వచ్చిన టైగర్ జిందా హై, వార్ (2019) మరియు పఠాన్ (2023) తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి నాలుగో సినిమా గా టైగర్ 3 సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా లో సల్మాన్ తన దేశంతో పాటు తన కుటుంబం కోసం కూడా ఫైట్ చేయనున్నాడు.ఒక దశలో తన దేశం కావాలో, కుటుంబంలో కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది.ఆ సమయంలో సల్మాన్ ఏ వైపుకు సాగుతాడు అనేది సినిమా కథ..
ఈ మూవీలో జోయా అనే ఏజెంట్, సల్మాన్ భార్య పాత్రలో కత్రినా కైఫ్ నటించింది. ఇక విలన్ గా బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మి నటించడం గమనార్హం.ట్రైలర్ మొత్తం మధ్యమధ్యలో షాడోలో కనిపించే ఇమ్రాన్ ను.. ట్రైలర్ చివరిలో అద్భుతంగా చూపించారు.వెల్‌కమ్ టు పాకిస్థాన్ టైగర్ అంటూ సల్మాన్ కు స్వాగతం పలుకుతాడు ఇమ్రాన్.సల్మాన్ ఖాన్ ప్రతీ సారి ఈద్ సమయంలో ఓ భారీ మూవీని విడుదల చేస్తారు. కానీ ఈసారి దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైగర్ 3 మూవీ నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో రానున్న ఈ సినిమా ట్రైలర్ ను హిందీతో పాటు సోమవారం (అక్టోబర్ 16) గ్రాండ్ గా రిలీజ్ చేశారు.మొత్తంగా టైగర్ 3 ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మూవీలోని యాక్షన్ సీన్స్ ముఖ్యంగా సల్మాన్, కత్రినా చేసిన స్టంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి..
Also Read
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
తాజావార్తలు
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
-
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!