Site icon NTV Telugu

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!

Farmer

Farmer

Rythu Bharosa : త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా, కొత్తదైనా ఆర్థికంగా ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత‍్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్థిక బాద్యతల మధ్యలోనే సీఎం రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.33,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రైతులకు “రైతు భరోసా” నిధులు అనుకున్న సమయంలో అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.

CM Chandrababu: యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు

Exit mobile version