NTV Telugu Site icon

Ooru Peru Bhairavakona : టీవీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్​ అడ్వెంచరస్​​​ మూవీ .. టెలికాస్ట్ ఎక్కడంటే..?

Ooruperu Bhairavakona

Ooruperu Bhairavakona

Ooru Peru Bhairavakona :  టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన “.. ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Read Also :Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల మూవీ షూటింగ్ అప్డేట్స్

ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఆ తర్వాత మార్చి 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు అలాగే ఓటీటీలో ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. తాజాగా “ఊరి పేరు భైరవ కోన” మూవీ వరల్డ్‌ టెలివెజన్ ప్రీమియర్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం జూన్‌ 30న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. థియేటర్స్ ,ఓటిటిలో ఆకట్టుకున్న ఈ మూవీ టీవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.