NTV Telugu Site icon

OG Update : పవన్ ‘ట్రిపుల్ పవర్’.. తట్టుకోవడం కష్టమే

The Og

The Og

OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘OG’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కాగా, ఈ సినిమాను అనౌన్స్ చేయటమే ఆలస్యం వెంటనే చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది. ఈ సినిమా తొలి షెడ్యూల్‍‌ను ముంబైలో, రెండో షెడ్యూల్‌ను పూణెలో పూర్తిచేసుకుంది.

Read Also: Naresh-Pavitra Lokesh : నరేష్-పవిత్ర “మళ్ళీ పెళ్లి” ఎప్పుడంటే..

సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్నాడన్న వార్త రాగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాలో పవన్‌ను సుజిత్ ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ‘OG’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రపై ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ అత్యంత ప్రెస్టీజియస్‌ తెరకెక్కిస్తున్నాడు.

Read Also:Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక

ఓజి సినిమాలో పవన్‌ను మూడు వైవిధ్యమైన వేరియేషన్లలో చూపించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. ఓజి మూవీలో పవన్ ఓ టీనేజర్, ఒక కాలేజీ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇలా మూడు వైవిధ్యమైన లుక్స్‌లో పవన్ కనిపించనుండటంతో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌ నటిస్తోంది. గతంలో ‘పంజా’ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పవన్, ఇన్నాళ్ల తరువాత మరోసారి డాన్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.