NTV Telugu Site icon

Heavy rain: సిక్కింను ముంచెత్తిన భారీ వర్షాలు.. ముగ్గురు మృతి.. పలువురు గల్లంతు

Raei

Raei

సిక్కింలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. మంగన్‌లో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందగా.. పలువురు తప్పిపోయారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ ప్రశంసలు..

ఎన్‌హెచ్ 10పై కొండచరియలు విరిగిపడడంతో సిక్కిం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జేసీబీలతో అధికారులు రోడ్లను క్లియర్ చేస్తు్న్నారు. ఇక సింగ్‌టామ్‌లోని శాంతినగర్ ప్రాంతంలో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పార్క్ చేసిన ఓ ఎస్‌యూవీ వెహికల్ బురదలో కూరుకుపోయింది. కుండపోత వర్షం కారణంగా సింగ్టామ్‌లోని చిసోపాని దగ్గర కొన్ని ఇళ్లు నీటమునిగాయి. పలుచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్‌ సింగిల్‌..

ఇదిలా ఉంటే జూన్ 16 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గోవా, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh : జగన్ తో వైసీపీ పార్టీ నేతలు కీలక భేటీ(వీడియో)