అకాల వర్షం వరంగల్ జిల్లాలో ముగ్గురి ప్రాణాలు తీసింది.. నర్సంపేట్ లో పిడుగు పడి ఒక్కరూ చనిపోతే…మహబూబబాద్ లో వర్షంలో బైక్ పైన వెల్లుతున్నవాళ్ళు ఇద్దరు యువకులు బైక్ ట్రాక్టర్ కి డీ కొని ఇద్దరు అక్కడికి అక్కడే చనిపోయారు మహబూబాబాద్ శివారులో నీ ఆర్తి గార్డెన్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది … ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైకుపై వస్తున్న ఇద్దరు యువకులు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు యువకులు చనిపోయారు.. మృతులలో ఒకరు గాంధీ పురం చెందిన శివ కాగా.మరొకరు పెనుగొండ గ్రామానికి చెందిన సాయిగా గుర్తించారు స్థానికులు.. ప్రమాదం జరిగిన సమయంలో గాలి దువారం వచ్చింది … అయితే ఈ ప్రమాదం గాలి బాగా వచ్చి ట్రాక్టర్ ను డి కొట్టారా లేదా అదుపుతప్పి ట్రాకర్ ను డికొన్నారా కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..
Also Read : Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు ఆస్వస్థత కు గురయ్యారు, నర్సంపేట మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ మృతి చెందగా బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖ మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు ఆస్వస్థత గురయ్యారు. వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు పిడుగు పడి మృతి చెందిన బానోతు సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన బాధితులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించారు.
Also Read : Bandaru Dattatreya : ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి